Saturday, June 23, 2012

నువ్వెళ్ళిపోతావ్....

నువ్వెళ్ళిపోతావ్....
(ఓ మాయమైన ఆలోచనకోసం)

నువ్వెళ్ళిపోతావ్......నా సంగీతాన్ని నాకొదిలి

పాళీ చివర్న అక్షరం మురిగిపోతుందన్నా
గొంతుమధ్యలో ఓ భావమేదో వెక్కిళ్ళలా
ఇరుక్కుందన్నా మాయమైతావు,
ఏ తియాన్మెన్ స్క్వేర్‌లోనో, బోగన్ విలియాల్లోనొ
వెతుక్కోమంటూ!

నిశ్శబ్దంలోపల  తవ్వుకుంటున్న సమాధిలోనొ
క్రికెట్ పక్షి చెట్టుకు కొట్టుకుంటూ పిల్చిన పిలుపులోనొ
నువ్వు కన్పడతావనుకున్నా!

అనిద్రలో ఉన్న మందారం
నన్ను కాదని వెళ్ళిపోయిన నిట్టూర్పు
స్వేచ్చని రెక్కల్లో దాచుకున్న పక్షుల కువకువల్లో
                        నీకోసం వెతుకులాట.....

అసంబద్ధపు నీడల్లోనో , అసమంజసపు గుడ్డల్లోనో
ఇరుక్కుపోయింటుందని నిర్లజ్జగా చూస్తుంటా
నా మాయమైన ఆలోచనకోసం....
            నానీడలాంటి ఆలోచనకోసం

ఏచీకటి రాత్రో వొచ్చిపోయిన మిణుగురుపురుగు సిగలో
చీకటితలుపుల్లోంచి తొంగి చూస్తున్న నైట్‌క్వీన్ నవ్వులో
నీ జాడలు వెతుకుతూ...వెతుకుతూ

గడ్డకట్టించే ఆలోచనకోసమొ
ఆకలికి, అసమానతలకి అడ్డంపడే
రక్తం చిందించని శిలువకోసమో!

నా నిరీక్షణ ఇలా
ఈ అస్తవ్యస్త అక్షరాలలో
నా ఆలోచనల వెతుకులాటలో....
                         22. జూన్.2012

15 comments:

  1. చాలా బాగా రాసారు....

    ReplyDelete
  2. సాయి గారూ ధన్యవాదాలు...మీరు నా బ్లాగ్ సందర్శించి స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు

    ReplyDelete
  3. nice one, chakkaga raasaarandi,
    keep writing.

    ReplyDelete
  4. deeni anuvadahani ippude N.S.MURTY gari blog lo chadivanandi,
    congrats.

    ReplyDelete
    Replies
    1. భాస్కర్ గారూ, ధన్యొస్మి. మూర్తిగారి అనువాదం నేనూ చదివాను, మెచ్చుకోకుండా ఉండలేం కదా?

      Delete
  5. Dev ji..

    కీట్స్ రాసిన Ode to A Nightingale గుర్తొచ్చింది

    ReplyDelete
    Replies
    1. జయశ్రీ గారు మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు. అంతస్థాయి తగునా నాకు?

      Delete
  6. చాలా బాగుంది వాసుదేవ్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. 'శ్రీ' మీ స్పందనలు కృతజ్ఞతలు.మీ పరీచయం నాఅదృష్టం. మీ అందమైన బ్లాగునీ, మరింత అందమైన కవితల్నీ చదివాను.

      Delete
  7. Replies
    1. మీ స్పందనకోసమే నా కవిత ఎదురుచూపు. మీ అభిమానపుర్వక మెచ్చుకోలుకి కృతజ్ఞతలు...

      Delete
  8. vaasudev gaaroo manchi bhaavana manchi bhaasha. goppaga raasaru.

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలు ఫాతిమాజీ...మీ కథలు క్రమం తప్పకుండా చదువుతున్నాను.మీ హాస్యరసభరిత రచనలు చదివిస్తాయి...

      Delete
  9. chaala bagumdandii
    aalasyam gaa ayinaa aaswaadinchagaligaanandi...

    ReplyDelete
  10. సీత గారూ కృతజ్ఞతలు...ఆలస్యమైనా మీ అభినందన అందుకున్నందుకు ఆనందమే...

    ReplyDelete