మాటకు మరణంలేదు
ఏ వాక్యమూ నశించిపోదు.....
నువ్వు మౌనివో, యోగివో
నీ చుట్టూ నిశ్శబ్ద సమాధి కట్టుకుంటావు
మరణానికెలాగూ భాషలేదు, ఇక జీవితమా
కొన్ని గుర్తులసమ్మేళనమే అని చెప్తూనె ఉంటావు....నిశ్శబ్దంగా!
తెల్లవాడివో, రంగద్దుకున్న అతివాదివో
నువ్వంటించిన ఆ కూ క్లక్స్ క్లాన్ శిలువ
మండుతూనె ఉంది, తెల్లగా! ఏంచెప్పలేక సతమతమవుతూ!
మనిషివో, మరమనిషిలా తయారయ్యావో
కణాన్నీ, క్షణాన్నీ విస్ఫోటిస్తే
వచ్చేది మన మనిషే, జీవం తాడు పేనుకుంటూ......
జెన్‌లు, సూఫీలందరూ అదే చెప్పివెళ్ళిపోయారు
ఏ యూదుడవో, యోధుడవో
మనసుల్నీ, మతాల్నీ విడదియ్యలేక ఓడిపోతుంటావు
నీకు తెలియందికాదులే మానవత్వం.....
ఇలియట్ లీజుకు తీసుకున్న ఓమ్ శాంతి ఓం అన్నా
రుడ్యార్డ్ కిప్లింగ్ కిమ్మన్నా,
ఆ భావమేమీ మరణించదు
ఆ వాక్యమేదీ మరణించదు........
రెండు నగ్నాక్షరాల మధ్య పోరాటంలో
ఓ కవిగద్ద తన్నుకుపోయే బాధలో
భావమేదీ మరణించదు....
అదెప్పుడూ జీవిస్తూనే ఉంటుంది
ఈ కవితల్లొ.....
తత్వవేత్తవో, మానవేత్తవో
మనసుతెల్సుకునే మాటేదైనా చెప్పగలవేమో చూడు
మనిషిగానో, రోబోగానో
ఓ పర్గేషన్ కోసమే, ఓ భావశుధ్ధికోసమో
రాసే వాక్యమేదీ మరణించదు
అవును, ఇక్కడ వాక్యానికి మరణమే లేదు
వాసుదేవ్ 17.జూలై.2012
అవును, ఇక్కడ వాక్యానికి మరణమే లేదు
ReplyDeleteఎంత చక్కగా చెప్పారో, nice one, keep writing.
అవును శ్రీనివాస్ గారూ...
ReplyDeleteరెండు నగ్నాక్షరాల మధ్య పోరాటంలో
ఓ కవిగద్ద తన్నుకుపోయే బాధలో
భావమేదీ మరణించదు....
అదెప్పుడూ జీవిస్తూనే ఉంటుంది
ఈ కవితల్లొ.....
చాలా బాగుంది...
@శ్రీ
sir, kavitha baagundi. manishi yodo oka chatramlo irukkuni untaadu.( meeru thappa evaroo ardam chesukoni raayagalaru ilaa )
ReplyDelete