Monday, January 24, 2011

దేవుడా ఓ దేవుడా!

---- వాసుదేవ్
నీదే న్యాయం
నిన్ను నిలదీస్తే
మాదన్యాయం
ఏమిటి నీ న్యాయం
నవ్వుతూ బతకండని
నీతులు చెప్పే నువ్వు
నవ్వేవాళ్లని, నవ్వించేవాళ్ళని
నిర్దాక్షిణ్యంగా ముగించే నువ్వు
న్యాయానికి క్రీడవి
అన్యాయానికి నీడవి
అందరూ నవ్వుతుంటే
బహుశా నీ ఉనికి కోల్పోతావనే
భయమా లెక
నిన్ను మాత్రమే జపించాలనే
స్వార్ధమా?
నీలీల మాకర్ధమైతె
నీ స్థాయి కోల్పోతావనే
అభద్రతా భావం కావొచ్చు

నవ్వుల యోగి
జంధ్యాలని చంపేసి
హాస్యపు భోగి
ఇవివీని ముగించేసి
నీఉనికి కోసం నియంతవే.

ఏది నిజం? ఏది నమ్మకం
నమ్మకం నిజం కానప్పుడు
నిజమే నమ్మకం

నమ్మకమే కర్మ కానప్పుడు
కర్మే నమ్మకం
నమ్మాలి.