నా అలసిన కనురెప్పల
దిగువన దాక్కున్న కథలన్నీ
నీ గుసగుసల్లోంచి పుట్టినవే సుమా!
ఒఠ్ఠు, ప్రేమసాచ్చి....
ఎప్పుడు కురిసినా, ఎలా కురిసినా
ఓ తన్నమయత్వంతొ కురుస్తూంటూంది
ఏరికోరి, మరీ
కొన్నింటిని బంధించబోతానా
నగ్నంగా పట్టుకున్నానేమో
సిగ్గుతొ వేళ్లసందుల్లోంచి జారుకుంటయి
ఆ సిగ్గులోనూ నువ్వే కన్పడ్డావులే....
భోరున కురిసినప్పుడల్లా, తెలియని విషయమేదో
కుండలతో ఒంపుతున్నట్టూ.....
నెమ్మదించినప్పుడల్లా ఓదారుస్తున్నట్టూ.....
మొత్తానికి కురిసిన ప్రతిసారీ
ఓ జ్ఞానోదయమైనట్టూ
నా అజ్ఞానాన్నేవరో గుర్తుచేస్తున్నంత వాన
అదే వెన్నెలా, అదే వానా
వెన్నెల్లాంటి వానలా, మనల్ని అనుకరిస్తున్నారా ఏం?
నువ్వేమో వెన్నెలా నేనేమో వాన
నీకేమో కుండల్లో నింపుకోడానికీ
నాకేమో కళ్ళనిండా పర్చుకోడానికీనూ......
ఇలా ఎవరికైనా జరిగేనా
నీకూ నాకు తప్ప...
నేనేమో భూమిని చుట్టేస్తూ
నువ్వేమో ఆకాశాన్ని చుడుతూ...
ఎన్నాళ్ళయిందనీ ప్రేమనీ ,వొర్షాన్ని,
నిన్నూ కట్టేసీ...
అన్నింటినీ నీలో చూసుకున్నాకే
నాకో తృప్తి అయింది...
ఈ వాక్యంలోఏం మాట్లాడవు, నీ నిశ్శబ్దమే జవాబంటూ
అవునులే నీ ప్రేమకి భాషుండదని
అర్ధమవటానికి జీవితాంతం పడుతుందిలే...
అదే ప్రేమంటే...
ప్రేమ..వర్షం లాంటి ప్రేమ!
నీనా ప్రేమ...
వర్షం అసూయపడే ప్రేమ
-----వాసుదేవ్
వాసుదేవ్ గారూ, అందమైన భావ వల్లరి, కవిత బాగుంది..మెరాజ్
ReplyDeleteమెరాజ్ గారూ, ఎప్పటిలా మీ ఆదరణ ముచ్చటగొల్పింది.కృతజ్ఞతలు
Deletepaaalapitta lo mee kavitha chadivaanu chalaa bagundi sir
Deleteమెరాజ్ గారూ ధన్యోస్మి. ఆసక్తిగా చదవటమే కాక అభిమానంగ ఇక్కడ మీ స్పందనరాసినందుకు మీకు చాలా ఋణపడిఉన్నా..
Deleteనేనేమో భూమిని చుట్టేస్తూ
ReplyDeleteనువ్వేమో ఆకాశాన్ని చుడుతూ...
ఎన్నాళ్ళయిందనీ ప్రేమనీ ,వొర్షాన్ని,
నిన్నూ కట్టేసీ...
చాలా బాగుంది వాసుదేవ్ గారూ!
అభినందనలు...
గురు పూజోత్సవ శుభాభినందనలు...
@శ్రీ
"శ్రీ" ధన్యవాదాలు. మీ సునిశిత పఠనానికీ, క్రమంతప్పని మీ అభిమాన స్పందనలకూ ఋణపడిఉంటా.
Deleteగురుపూజా దినోత్సవ శుభాకాంక్షలండీ మీకు.
ReplyDeleteసుభాగారూ, ధన్యవాదాలు చిన్నమాటే.మీ స్పందన మరింతగా రాయిస్తుందనిమాత్రం మాటివ్వగలను. మీరిక్కడ మొదటిసారనుకుంటా..మీ స్పందనభాగ్యమా అని మీ బ్లాగ్ సందర్శన భాగ్యం కలిగింది.
Deleteకవిత నాకు నచ్చిందండి వాసుదేవ్ గారు.
ReplyDeleteధన్యవాదాలండీ..ఎంతో ఓపిగ్గా నా బ్లాగ్ సందర్శించి మీ స్పందనని రాస్తారు...మీ అందరి కోసమైనా ఇంకా రాయాలనుంటూంది
Deleteఇలా ఆమె తోడున్న అందమైన వర్షపురాత్రులెన్నో???:-)
ReplyDeleteపద్మగారూ నమస్తె...మీ ఆత్మీయస్పందన అలరించింది....మీ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి మరీ స్పందన రాసినందుకు కృతజ్ఞతాభివందనములు
Deleteప్రేమలో థీసిస్ చేసారా వాసుదేవ్ గారూ...ఇన్ని రకాలుగా వర్ణిస్తారూ...:)
ReplyDeleteవర్మగారూ ఎలా ఉన్నారు? మీ రాకమాకెంతో సంతొషం సుమండీ అని పాడాలనుంది.చాన్నాళ్ళ తర్వాత మా బ్లాగుని సందర్శించి మమ్మల్నీ పావనం చేశారు.ప్రేమలో థీసీస్ మాట అటుంచి, ఇంకా ఒడ్డున గులకరాళ్ళేరుకుంటున్నవాణ్ణి.మీ అందరి అభిమానం, ప్రేరణ (ఒకటో, అరో కాపీ)తోనే ఇలా రాసేస్తుంటాం.పాపం పాఠకదేవుళ్ళు నను క్షమించేస్తుంటారు. ధన్యవాదాలు వర్మ
Deleteఇలాంటి భావనతొనే నేను ఒకటి వ్రాద్దామనుకున్నాను. చాలా బాగా వ్రాసారు.
ReplyDeleteచిన్ని గారూ స్వాగతం నాబ్లాగింటికి.మీరిదే మొదటిసారనుకుంటా ఇక్కడ.మీస్పందన తెగనచ్చేసి మీపేరుపట్టుకుని మీ బ్లాగ్ చూశాను. మీ హాస్యప్రియత్వం ముచ్చటేసింది.ఈ రోజుల్లో హాస్యరస రచనలూ చతురసంభాషణలు బాగా తగ్గిపోయాయి. మళ్ళీ మీ పరిచయభాగ్యం ఆ లోటునీ తీరుస్తుందనుకుంటున్నా..మీ ఆత్మీయస్పందనకు కృతజ్ఞతలు
Delete