మా వోడొస్తాడా?
-----------------
సూరీడు సచ్చిపోనాడో, ఇయ్యాల మరి
దాక్కుండీ పోనాడో మేగాలెనకాతల
ఏం సెప్పాడు కాదు వొర్సం గురించి
"వొత్తాదిలేవే, రాకెక్కడికి పోతాది
ఈ మడుసులకి బువ్విచ్చేది మనమే కదే
మరి ఈ వొర్సానికి మనం కావాలి
దానికీ మనం కావాలి యాడికి పోతాదిలే!"
ఆడు సిన్నప్పట్నుంచి అట్టాగే
ఆటికేసి సూత్తూనే ఉన్నా
ముంతలొలకబోసుకోలేదు
మావ తిడతాడు,,,,అట్టా సెయ్యొద్దని
పొలానికీ నీళ్ళు కావాలే
ఆడికి మందులోకి కావాలే, ఊరుకుంటా
"అవునూ మావా మనకది కావాలే
కానీ దానికీ మనం కావాలంటావా, అదెలాగా?"
"అంటే ఎర్రిమొగమా, దాన్ని మెచ్చుకున్నదే మనం కదే?
సినుకు పెతీ గోళాన్నీ కౌగలించుకుంటానా
పెతీ సినుకునీ మగ్గెగడతానా
గోలాల్లో దాస్తానా, పేమగా
అందులో నన్ను నేను సూసుకుంటాను గదే?
మది దానికి మాత్రం ఎవరున్నారే మనం తప్ప?"
"అవును, మావా! నిజమే
మనకే కాదు, దానికీ మనం కావాలె
నిన్నంతా అలా ఆకసంకేసి సూత్తనే ఉన్నా
ఒక్క సినుకైనా మీ మీద పడిపడితే
నన్ను లాక్కుంటావనుకున్నా..
ఉహూ.. సినుకూ రాలేదు, నువ్వూ ఊ లెయ్యలా!"
"వత్తాదే! రాకెక్కడికి పోతాదే
మనం నమ్ముకున్నాం కదే"
మరి మన సిన్నోడీనీ కూడా నమ్మే కదా మామా
పంపాం పట్నానికి..
పతీ సైకిలూ బెల్లుగంటా కేసి వొత్తాడేమోననీ సూత్తున్నా"
"వాడు, మనకొదుకైనా మనిషే,
వొర్సం, మన కడుపుసించకపోయినా
మడిసికాదే, అదో వరం
అది మోసం సెయ్యదు, మడుసుల్లాగా"
"ఏంటో ఈడూ మడిసే, ఈణ్ణే నమ్ముకున్నా
నాకేటన్యాయం సేసాడు?
నన్నొగ్గలేదే, మరి నా కొడుకేంటో
అమ్మన్నాడు కడుపుతోటి!"
"ఏమే వొత్తావా, మన కొడుకు రాడే
కానీ వొర్సం వొత్తాదే!"
"మరిగంతే గామోసు, ఏటి నమ్మాలో
ఏటి నమ్మకూడదో, ఈ జన్మకి ఆడొస్తేనే కానీ
తెనీదు, మరి గంతే గామోసు!"
సూరీడు సచ్చిపోనాడో, ఇయ్యాల మరి
దాక్కుండీ పోనాడో మేగాలెనకాతల
ఏం సెప్పాడు కాదు వొర్సం గురించి
"వొత్తాదిలేవే, రాకెక్కడికి పోతాది
ఈ మడుసులకి బువ్విచ్చేది మనమే కదే
మరి ఈ వొర్సానికి మనం కావాలి
దానికీ మనం కావాలి యాడికి పోతాదిలే!"
ఆడు సిన్నప్పట్నుంచి అట్టాగే
ఆటికేసి సూత్తూనే ఉన్నా
ముంతలొలకబోసుకోలేదు
మావ తిడతాడు,,,,అట్టా సెయ్యొద్దని
పొలానికీ నీళ్ళు కావాలే
ఆడికి మందులోకి కావాలే, ఊరుకుంటా
"అవునూ మావా మనకది కావాలే
కానీ దానికీ మనం కావాలంటావా, అదెలాగా?"
"అంటే ఎర్రిమొగమా, దాన్ని మెచ్చుకున్నదే మనం కదే?
సినుకు పెతీ గోళాన్నీ కౌగలించుకుంటానా
పెతీ సినుకునీ మగ్గెగడతానా
గోలాల్లో దాస్తానా, పేమగా
అందులో నన్ను నేను సూసుకుంటాను గదే?
మది దానికి మాత్రం ఎవరున్నారే మనం తప్ప?"
"అవును, మావా! నిజమే
మనకే కాదు, దానికీ మనం కావాలె
నిన్నంతా అలా ఆకసంకేసి సూత్తనే ఉన్నా
ఒక్క సినుకైనా మీ మీద పడిపడితే
నన్ను లాక్కుంటావనుకున్నా..
ఉహూ.. సినుకూ రాలేదు, నువ్వూ ఊ లెయ్యలా!"
"వత్తాదే! రాకెక్కడికి పోతాదే
మనం నమ్ముకున్నాం కదే"
మరి మన సిన్నోడీనీ కూడా నమ్మే కదా మామా
పంపాం పట్నానికి..
పతీ సైకిలూ బెల్లుగంటా కేసి వొత్తాడేమోననీ సూత్తున్నా"
"వాడు, మనకొదుకైనా మనిషే,
వొర్సం, మన కడుపుసించకపోయినా
మడిసికాదే, అదో వరం
అది మోసం సెయ్యదు, మడుసుల్లాగా"
"ఏంటో ఈడూ మడిసే, ఈణ్ణే నమ్ముకున్నా
నాకేటన్యాయం సేసాడు?
నన్నొగ్గలేదే, మరి నా కొడుకేంటో
అమ్మన్నాడు కడుపుతోటి!"
"ఏమే వొత్తావా, మన కొడుకు రాడే
కానీ వొర్సం వొత్తాదే!"
"మరిగంతే గామోసు, ఏటి నమ్మాలో
ఏటి నమ్మకూడదో, ఈ జన్మకి ఆడొస్తేనే కానీ
తెనీదు, మరి గంతే గామోసు!"
బాగుంది శ్రీనివాస్ గారూ!
ReplyDeleteమనిషి మోసం చేస్తాడేమో గానీ...
మేఘం మోసం చేయదు...
బాగా వ్రాసారు...
అభినందనలు...
@శ్రీ
"శ్రీ" గారూ ధన్యవాదాలండీ..మీరు ఓపిగ్గా చదివి స్పందించటం ముచ్చటైన విషయం
Deleteబాగుందండి.
ReplyDeleteమీ స్పందనకు కృతజ్ఞతలు
Deleteవాసుదేవ్ గారూ, కవిత బాగుంది,
ReplyDeleteవాన వస్తుంది, ప్రకృతి మోసం చేయదు. మనిషి మాత్రమె చేయగలదు.
మంచి కవిత.... మెరాజ్.
ఫాతిమాగారూ నమస్తే, ఎలా ఉన్నారు? కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత మీ సిరా ఒలికింది ఇక్కడ-ధన్యోస్మి! అవునండీ ఇది నా అనుభవం. దాదాపు మనంరాసే కవితల్లో ఎక్కువ అనుభవాల్లోంచి తీసుకున్నవేగా.మీరు నా బ్లాగ్ ని సందర్శించి మీ అభిప్రాయాన్ని రాయటం అభినందనీయం.
ReplyDelete