గుడికన్నా ముందే పలకరించే
ఆ డైభ్భై ఏడు మెట్లూ డైభ్భై ఏడు కథలు
కష్టం వెనుకే సుఖమన్నది చెప్పడంకోసమన్నట్టు
*
ఒంపులుతిరిగుతూ ఊరించే ఆ మెట్లమీదే
బాల్యం చిన్నపాదాలతో....
ఒక్కోమెట్టుని వెనక్కి నెడుతున్నాననే ఆనందంలోనూ
అమ్మ చెయ్యి ఆసరాలోనూ కథలు అవసరం అన్పించవు
గతాన్ని ఎక్కడో కలిపేసె ఆలోచనలో అమ్మ
వర్తమానాన్నివొదిలేసె ఖంగారులో నేను
కొన్న జ్ఞాపకాలు......
* *
ఓ మెట్టు చివర్న అప్పుడె మొలకెత్తుతున్న ఓ గడ్డిమొక్కా
మరోమెట్టుఅంచున కాలానికి లొంగిపోయిన శంఖంపువ్వు
దేన్నుంచి విడివడిందో మరో సంపెంగ రెమ్మా
అవన్నీ పలకరిస్తూ..
ఒక్కోక్కటీ ఒక్కోకథ
జీవితానికి సరిపడా !
* * *
అంత 'దూరం' వచ్చిన తర్వాతకానీ మెట్లాగవు
ఓ సారి వెనక్కి తిరిగిచూస్తే
దాటొచ్చిన జీవితంలా, రెపరెపలాడుతున్న పేజీల్లా
ప్రతీ మెట్టులో ఓ కథ విన్పడుతూనె ఉంది
ఆ కథలన్నీ
ఓ జ్ఞాపకం కూడా!
* * *
అక్కడే
ఓ పిలుపు మళ్ళీ...ప్రతీ మెట్టూ ఓ కథతో
ఎన్ని నగ్నపాదాలని మోసాయో
మరెన్ని కథల్ని విన్నాయో కన్నీటి నేపథ్యంలో
అవన్నీ ఇప్పుడు వెలలేని సంచికలు
* * *
అమ్మ అంటూనే ఉండేది
'నీతో గుడికిరావటం ఓ అనుభూతిరా' అని
అదేంటో అర్ధం కాని వయసు!
ఎన్ని అనుభవాల్ని అక్కడ కథలుగా వదిలిందో అమ్మ
మెట్లంతా రాళ్ళే...జ్ఞాపకాల శిలాజాల్లా
* * *
ఏం జరిగిందో ఎందుకెళ్ళానో తెలీకుండానే
మెట్లు దిగుతూండగా--
చీరకొంగుతో నాచెయ్యి తుడుస్తూన్న ఆమెలో
తెల్ల రంగు అద్దుకున్న ఆ నవ్వు
అప్పుడేం తెలీదు, అమాయకంగా
ఇదిగో ఇప్పుడే అవగతం
గతాన్నీ ఇలానే చూడమని చెప్పిందేమో..
గుడిని పరిచయంచేసి, ఈ ప్రపంచాన్నిచ్చింది అమ్మ
* * *
ఆ తెల్ల నవ్వు,ఇంకా గుండెల్లో పదిలం
గుడి...అమ్మ..ఓ జ్ఞాపకం
నిన్న వర్షంలో పట్టుకున్న
ఓ బిందువులా
కథలన్నీ చెప్పి జారిపోతూ!
జీవితపుటల్లో అందమైన బుక్‌మార్క్
ఈ గుడి..మెట్లు
* * *
ఆ గుడింకా ఉంది, మెట్లూ ఉన్నాయి
ఆ జ్ఞాపకమూ ఉంది
అమ్మే లేదు
చేతుల్లోంచి జారిపోయిన తీర్ధంలా
వెళ్ళిపోయింది......
నన్ను ఆ మెట్లమీదొదిలి
ఆ శిధిల కథలన్నీ నా
బతుకు బాటలో సహచరులు....
26.September.2012
ఆ డైభ్భై ఏడు మెట్లూ డైభ్భై ఏడు కథలు
కష్టం వెనుకే సుఖమన్నది చెప్పడంకోసమన్నట్టు
*
ఒంపులుతిరిగుతూ ఊరించే ఆ మెట్లమీదే
బాల్యం చిన్నపాదాలతో....
ఒక్కోమెట్టుని వెనక్కి నెడుతున్నాననే ఆనందంలోనూ
అమ్మ చెయ్యి ఆసరాలోనూ కథలు అవసరం అన్పించవు
గతాన్ని ఎక్కడో కలిపేసె ఆలోచనలో అమ్మ
వర్తమానాన్నివొదిలేసె ఖంగారులో నేను
కొన్న జ్ఞాపకాలు......
* *
ఓ మెట్టు చివర్న అప్పుడె మొలకెత్తుతున్న ఓ గడ్డిమొక్కా
మరోమెట్టుఅంచున కాలానికి లొంగిపోయిన శంఖంపువ్వు
దేన్నుంచి విడివడిందో మరో సంపెంగ రెమ్మా
అవన్నీ పలకరిస్తూ..
ఒక్కోక్కటీ ఒక్కోకథ
జీవితానికి సరిపడా !
* * *
అంత 'దూరం' వచ్చిన తర్వాతకానీ మెట్లాగవు
ఓ సారి వెనక్కి తిరిగిచూస్తే
దాటొచ్చిన జీవితంలా, రెపరెపలాడుతున్న పేజీల్లా
ప్రతీ మెట్టులో ఓ కథ విన్పడుతూనె ఉంది
ఆ కథలన్నీ
ఓ జ్ఞాపకం కూడా!
* * *
అక్కడే
ఓ పిలుపు మళ్ళీ...ప్రతీ మెట్టూ ఓ కథతో
ఎన్ని నగ్నపాదాలని మోసాయో
మరెన్ని కథల్ని విన్నాయో కన్నీటి నేపథ్యంలో
అవన్నీ ఇప్పుడు వెలలేని సంచికలు
* * *
అమ్మ అంటూనే ఉండేది
'నీతో గుడికిరావటం ఓ అనుభూతిరా' అని
అదేంటో అర్ధం కాని వయసు!
ఎన్ని అనుభవాల్ని అక్కడ కథలుగా వదిలిందో అమ్మ
మెట్లంతా రాళ్ళే...జ్ఞాపకాల శిలాజాల్లా
* * *
ఏం జరిగిందో ఎందుకెళ్ళానో తెలీకుండానే
మెట్లు దిగుతూండగా--
చీరకొంగుతో నాచెయ్యి తుడుస్తూన్న ఆమెలో
తెల్ల రంగు అద్దుకున్న ఆ నవ్వు
అప్పుడేం తెలీదు, అమాయకంగా
ఇదిగో ఇప్పుడే అవగతం
గతాన్నీ ఇలానే చూడమని చెప్పిందేమో..
గుడిని పరిచయంచేసి, ఈ ప్రపంచాన్నిచ్చింది అమ్మ
* * *
ఆ తెల్ల నవ్వు,ఇంకా గుండెల్లో పదిలం
గుడి...అమ్మ..ఓ జ్ఞాపకం
నిన్న వర్షంలో పట్టుకున్న
ఓ బిందువులా
కథలన్నీ చెప్పి జారిపోతూ!
జీవితపుటల్లో అందమైన బుక్‌మార్క్
ఈ గుడి..మెట్లు
* * *
ఆ గుడింకా ఉంది, మెట్లూ ఉన్నాయి
ఆ జ్ఞాపకమూ ఉంది
అమ్మే లేదు
చేతుల్లోంచి జారిపోయిన తీర్ధంలా
వెళ్ళిపోయింది......
నన్ను ఆ మెట్లమీదొదిలి
ఆ శిధిల కథలన్నీ నా
బతుకు బాటలో సహచరులు....
26.September.2012
Wonderful poetry!
ReplyDeleteKeep writing.
ధన్యోస్మి సుబ్రహ్మణ్యంగారూ...ఇక్కడికి మీరాక, మీ స్పందన నన్ను సంతసుణ్ణి చేసింది.
Deleteబాగుంది.
ReplyDeleteధన్యవాదాలు చిన్నమాటే.మీ స్పందన ఆనందంగా ఉంది సర్ గోపాలకృష్ణ గారూ..
DeleteExcellent...చాలా నచ్చిందండి.
ReplyDeleteక్రమం తప్పకుండా మీరాక, అంతే క్రమంగా మీ స్పందన ముచ్చటేసింది వెన్నెలగారూ
Deleteవాసుదేవ్ గారూ, కవిత చాలా బాగుంది. నిజమే అమ్మని జ్ఞాపకం చేసి గుడిమెట్లు,
ReplyDeleteతెల్ల పువ్వులూ ఇంకా ఎన్నో జ్ఞాపకాలను అందంగా పొందు పరిచారు. చక్కటి కవిత ....మెరాజ్
మెరాజ్ గారూ మీ మెప్పు ఎప్పుడూ ఆనందమె....సాటి స్త్రీ మెచ్చిందే అందమని కదా సామెత.
Deletehi srinivas garu.chala rojulaki chusa mi blog.bagundhi
ReplyDelete