Sunday, May 27, 2012

తడవని జ్ఞాపకం

1.
కురవకుండానే వెళ్ళిపోయిన మేఘం
ప్రేమలేఖ సగంలో విరిగిపోయిన పాళీ
2.
పరిష్వంగపు కలలో మెలకువ
వెన్నెల రాత్రిలో ఒంటరితనపు అలసట
3.
అమ్మతెచ్చిన ఆరేసిన బట్టల్లో ఆట
జొన్నపొత్తులని కాల్చని నిప్పులపొయ్యి
4.
ఊరొదిలి వెళ్ళిపోతున్న పక్కింటమ్మాయి
ఎవ్వరికీ కన్పడకుండా ఆమె ఊపిన చెయ్యి
5.
అమ్మతో గుడికెళ్ళి శఠగోపంకోసం మారాం
వయసుడిగిన తాటిముంజల్లో వెతుకులాట
6.
 జ్ఞాపకాల సహచర్యం ఓ ఓదార్పు
గుండెకిందచేరిన తడిలా....నాతోనే

9 comments:

  1. బాగున్నాయి మీ జ్ఞాపకాలు, అప్పుడప్పుడు మమ్మల్ని పలకరించి వెళ్ళే మీ కవితల్లా...

    ReplyDelete
  2. entha andamaina gnaapakalo Sir baaga rasaaru

    ReplyDelete
  3. ఫణి గారికి, జలతారు వెన్నెల గారికి, ఫాతిమా గారికి ధన్యవాదాలు. ఓపిగ్గ చదివి మరింత ఓపిగ్గా మీ స్పందనని తెలియజేసినందుకు.

    ReplyDelete
  4. చాలా బాగుంది సార్ .....మీ జ్ఞాపకాల పొదరిల్లు.:)very nice

    ReplyDelete
  5. జ్ఞాపకాల సహచర్యం ఓ ఓదార్పు
    గుండెకిందచేరిన తడిలా....నాతోనే chalaa bagundi

    ReplyDelete
  6. సీత గారికి, భాస్కర్ గార్కి, సుజనగారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు

    ReplyDelete
  7. This is one of my fav from ur pen :-)

    ReplyDelete