Tuesday, May 22, 2012

వర్షం.....!!


వర్షం.....!! 
      నా బయోగ్రాఫర్!!

వర్షం నా బలమైన బలహీనత!
పృధ్వంటే వర్షానికున్న బలహీనతలా...
నువ్వంటే నాకున్న ప్రేమలా.
నేలని చేరే ప్రతీ చినుకు గోళం
నా గుండెలపైనుంచే జారుతున్న భావన!
స్వర్గం నుండి నన్ను పలకరించే కొరియర్ లా!

ఎన్నెన్ని నిండుగోళాలని
అలా నాలా వర్షిస్తూనే ఉన్నయ్
తమ ఆత్మకథని చెప్తున్నట్టు...
వాటిలో వాటికి ఎంత తొందరని
నిన్ను చేరాలనే నా ఆత్రంలా!

ప్రేమాచ్చదన గుండెపై
నగ్నగోళాల  స్వాంతన చినుకులు!
చేయిచాచి అడిగినప్పుడల్లా
ఎన్ని కురిసాయని నా అరచేతిలొ
ప్రేమగా!
నీ ప్రేమలా!

వర్షించినప్పుడల్లా ఓ కన్నీటి వ్యధ
ఓ షెహనాయీ వేదన...
తమ అందచందాలను ఆస్వాదించమన్నట్టు
ఆ ఒంపుసొంపులపైనుంచి
నా దృష్టిని మరల్చలేదెప్పుడూ!

వర్షంలో తడిసీ తడవకుండా
ఓ చేతిని బయటకు చాచినప్పుడల్లా
చూరునుండి భారమైన చుక్కలు
నా జ్ఞాపకపు నీడల్లా.....
ప్రతీ గోళం ఓ కథచెప్తూనే ఉంది
ఓ జ్నాపకాన్ని వొదుల్తూ తమకంగా!

వర్షపు నడుము చుట్టూ నాచేతులు
 ప్రతి బొట్టులో ఓ కొత్త నడుము,
ప్రతీ చుక్క ఓ కొత్తదనం
ప్రతీ నడుమూ
కొత్త భావన, నా కొత్త అనుభూతిలా!

వెండిదారాలుగా నన్ను చుట్టుముట్టేసిన
ప్రతీ ధారా ఓ దృశ్యకావ్యం!
ఎన్ని సార్లని అలా నన్ను నేను
కోల్ఫొయానో నా చేతిని ఆనడుముచుట్టూ
తడుముకుంటూ...

ఎంత నిశ్శబ్దంగా కురుస్తుందనీ
ఒక్కోసారి!!
మనసు బావురుమనప్పుడల్లా
కురిసిన కన్నీటీ బొట్లలా....
ఆ వర్షపు గోళాల్లో కనుమరుగవుతూ
నేను!

ప్రతీ చినుకూ, ప్రతీ గోళం
నన్నూ తడుపుతూనే ఉన్నయ్
నా కన్నీటిని తమలో కలిపేసుకుంటూనే
నా వ్యధని పంచుకుంటూనే ఉన్నయ్!

వర్షం...ఓ అద్భుతం
నా ప్రేమ కహానీలా
వర్షం నా రచయిత్రి
నా సహచరిలా!!

నా కథని రాస్తూనే ఉంటుంది
నా బయోగ్రాఫర్ లా!

                   --వాసుదేవ్
(2012 హంసిని వెబ్ మ్యాగ్ నిర్వహించిన నందననామ ఉగాది కవితలపోటీలో బహుమతి పొందిన కవిత)


4 comments:

  1. మనసు బావురుమన్నపుడల్లా కురిసిన కన్నీటి బొట్టులా ... ఎవరు రాయగలరు మీరు తప్ప సార్ అతిశయోక్తి కాదు. నిజంగానే ప్రశంస కి అర్హత ఉంది మీ కవితకి

    ReplyDelete
  2. జలతారు వెన్నెల గారికీ, ఫాతిమా గారికీ మనస్ఫురిత కృతజ్ఞతలు

    ReplyDelete
  3. ఎన్ని సార్లని అలా నన్ను నేను
    కోల్ఫొయానో నా చేతిని ఆనడుముచుట్టూ
    తడుముకుంటూ...-అద్భుతంగా వుంది వాసుదేవ్ గారూ.పనికి వచ్చే పంక్తులతొ వెంటనే స్పందించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete