Tuesday, February 14, 2012

"ప్రేమ!"


రెండు నగ్నాక్షరాల మాయ
రెండు మనసుల రసమయ క్రీడ!

జీవితపు శృతిలయల చిత్తరువు
భావలజడుల గ్రాఫిటీ
ప్రేమనిండిన
మనసుగదిగోడలనిండా
ప్రేమామృతపు తేనియతుట్టలే


కలలకీ రంగులద్దీ
మనసుకీ ఉనికినిచ్చి
మనిషితనానికి ఉపిరులూదే
ప్రేమతనం
ఓ కొంటెతనం!
మౌనానికీ అర్ధాన్నిచ్చీ
కళ్ళకీ భాషనిచ్చిన
ప్రేమ
ఓ మతం


ప్రేమ
మనసు సింగారానికి
ఓ కొలమానం
విధాత సృష్టినుంచి ఓ బహుమానం!
ప్రేమ విస్ఫోటనా కాంతి
మనసంతా పరచుకుని
జీవితాంతమూ ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది...
జీవితాంతమూ.....

ప్రేమ కి పుట్టినరోజు శుభాకాంక్షలతో........
.14/02/2012

7 comments:

  1. మీ అక్షరస్పందనకు ధన్యవాదాలు కష్టెఫలి గార్కి, పద్మార్పిత గార్కి.

    ReplyDelete
  2. ప్రేమ గురించి చాలా బాగా చెప్పారు.

    వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి..

    ReplyDelete
  3. కృతజ్ఞతలు రాజ్ గారూ...కాని "వర్డ్ వెరిఫికేషన్" తీసేయడమంటే అర్ధం కాలేదు...వివరిస్తారా?

    ReplyDelete
  4. wow.............excellent గా ఉంది మీ కవిత...ఎంత మధురం గా ఉందో..చాలా బాగా రాసారు....

    ReplyDelete
  5. word verification అంటే ఎమీ లేదు.మీకు కామెంట్ పెట్టాల్సినప్పుడు రెండు పదాలు అడుగుతుంది కదా అది .దాన్ని తీసివేయడము చాలా సులభము.
    first go to ur dashboard and go to settings.
    in settings go to comments ...in that u find
    "Show word verification for comments?" .it will be the 3rd lable from down. please disable that...!! so that the commenting is easy for a user .
    :).
    thank u.

    ReplyDelete