Tuesday, February 7, 2012
చాయాగీత్
ఆ రాత్రి -----
నా కంటి వెలుగునే తన నెల వంకని చేసుకుని
తటిల్లతలా మెరిసి మాయమౌతూ నవ్వుల శశాంక
చీకటి అంచులను మేస్తూ తెల్లగా మెరుస్తున్న
ఈ నైట్ వాచ్మన్....
వెన్నెల వెండి తెరలో నుంచి తొంగి చూస్తూ
మబ్బుల తివాచీపై ఇంద్రధనువులా తన వైభవాన్ని ముద్రిస్తూ ముద్దు కౌముది
పున్నమి పందిరిలో చెక్కిన ఆలోచనా శిల్పాల అద్భుత లల్లబీలతో
అపురూప సుషుప్తలోకి అలవోకగా జారుకుంటూ...నేను!
బద్ధకంగ్గా నా శ్వేత వర్ణపు ఉదయాన్ని ఆవిష్కరిస్తూ....
గొంతులోకి జారబోయే బ్లాక్ కాఫీలో తెల్లటి ముద్దంటి మంచుముక్క
హఠాత్సంఘటనలకి అవాక్కయినట్టు
రెండింటినీ ఆస్వాదిస్తున్నప్పుడు--
బలమైన ఆలోచనా తరంగాల్ని మెత్తగా స్పృశిస్తూ
ఓ హార్న్‌బిల్!
అందాన్ని, ఆనందాన్ని చిన్ని ప్రాణంలో పెట్టి
రంగులేసినట్లు...
తన తెలుపు నలుపు రెక్కల్ని అల్లల్లాడిస్తూ....
ఆకాశాన్ని, మబ్బుల్నీ విడదీస్తున్నట్లు
ఓ అందమైన రంగుల పెయింటింగ్
నలుపు తెలుపుల్లో ఈ హార్న్బిల్!
నీ అందమనే ఎనస్థీషియా నా వెచ్చని లోతుల్లోకి ఎక్కేస్తుంటే
నన్ను నేను కోల్పోయి
నా నలుపు తెలుపు ఆలోచనలని ఒక్క ఉదుటున
వన్నెల వెన్నెలలా మార్చేస్తున్న నిన్ను తలచుకొని
అలా కోల్పోతూ...కోల్పోతూనే ఉన్నా....
నా గుండె గడియారం సవ్వడిస్తున్నంత కాలం
----వాసుదేవ్
(అఫ్సర్ గారి బ్లాగులొ "రాజన్ బాబు గారి తెలుపు-నలుపు కవిత్వం" అనే ఆర్టికల్ కి స్పందనగా రాసుకున్నది)
Subscribe to:
Post Comments (Atom)
హమ్మో.. ఇంత చక్కటి.. చిక్కని.. భావానికి నా స్పందనను ఎలా తెలియజేయగలను.. ??
ReplyDeleteసూ...పర్ అనడం తప్ప.
అయ్యా బాబోయ్..... నాకైతే ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్న భావన కలుగుతోంది
ReplyDeletesimply superb
"వన్నెల వెన్నెలలా మార్చేస్తున్న నిన్ను తలచుకుని నా గుండె గడియారం సవ్వడిస్తున్నంతకాలం......." How Sweet... చాలా బాగుంది శ్రీనివాస్‌గారు..
ReplyDeleteపూర్తి తాదాత్మ్యం చెంది,కలం పట్టినట్లుగా ఉంది కవిత.I loved it.
ReplyDeleteచివరి నాలుగు లైన్లు అమోఘం!
ReplyDeleteరాధిక, శోభ, శ్లోకాశాస్త్రి, పద్మార్పిత, కవి యాకూబ్ గార్లందరికీ ధన్యవాదాలు. మీ స్పందన మరింత ఆలోచింపచేస్తుంది. మరింత మంచి కవిత్వం వచ్చే అవకాశమూ ఉంది.
ReplyDelete"వెన్నెల వేళ ఇష్టమైన ప్రేమ తరంగాలు మనసు సంద్రాన్ని అలల పెదవులతో స్పృశిస్తుంటే..
ReplyDeleteతలపుల పరిష్వంగం లో ప్రేమాన్తరంగం పరవశం" తలపిస్తోంది మీ కవిత దేవ్ గారు..
వావ్వ్వ్వ్ ... జస్ట్ ఫీలింగ్ ది మూన్ లిట్ నైట్..
జయాజీ,ఇంతభావుకత్వాన్ని ఒలికించిన మీ స్పందనముందు నా కవిత చిన్నబోయింది. మీకలం చిలికించిన ఈ పదాలవెన్నెలలొ గీతమూ గీత రచయితా తడిసిముద్దయ్యారు. కృతజ్ఞతలు
ReplyDeleteమీ కవిత చదివాక..
ReplyDeleteమబ్బుల దుప్పటి కప్పుకుని ..
ఇంద్రధనుస్సునే కళ్ళాలుగా చెసుకుని..
స్వప్నాస్వాలపై వినువీదుల ఈ మనసు ఉరేగుతొంది..
ఈ ఎనస్తీషియా మీ కవిత ప్రభావమే సుమా...
ధన్యవాదాలు జ్యోతిగారూ....ఆ ఎనస్తీషియా నుండి బయటపడ్డారా లేదంటే మరో డోస్ యాంటిడోట్ ఇమ్మందురా?
Delete"అందాన్ని, ఆనందాన్ని చిన్ని ప్రాణంలో పెట్టి
ReplyDeleteరంగులేసినట్లు"...మీ బావుకత్వాన్ని నాక్కొంచెం నేర్పించరూ..plsss