Friday, October 11, 2013

వీడే…. ఆ మాటలన్నీ మోసాడు



చిక్కటి రాత్రిలోనూ, పగటి మేఘంలోనూ
మోసాడు... మాట బరువంతా!
పదాల పదునంతా కాపుకాసాడు
మనలోనూ వీడే, మనుషుల్లోనూ వీడే
పొక్కిలి చేసేదీ వీడే, ముగ్గులు వేసేదీ వీడే
వీడే మన మనోడు
మనందరిలోనూ మసలే మనసున్నోడు

మిణుగురు పురుగుల నీడల్లోనూ
రెప్పలకిందటి చీకటిలోనూ వెలుగుతూనే ఉంటాడు
బరువెక్కిన మనసునెప్పుడో ఈదేసాడు

గుండెలో చేరిన చెమ్మని వెన్నమూటలో కట్టేసాకె
దానికి మాటనివ్వలేకపోయానెప్పుడూ....
అప్పుడే వచ్చాడీడు ఓ పదాన్ని వెంటేసుకుని...
నీకెందుకు నేనున్నానంటంటూ....
నాతోనే ఉన్నానంటూ……ఉంటూనే ఉన్నాడు

మాటని మంత్రం చేసి మరీ తప్పుకున్నాడు
అప్పుడు కదా అర్ధమయింది
"ఘోరీలు కట్టేది వీడే...గోడలు కూల్చేది వీడే...."
వీడే నా అద్దం!
నా తరఫున మాట్లాడేది వీడే
వీడి పేరే అక్షరం

4 comments:

  1. మీతరపున ఉన్న వాడెప్పుడూ(అక్షరం) వాడీయిన వాడే
    పూదోటలూ,కలల కొలనులూ వాడేగా పలికింది, పలికించింది మీరే కదా...
    చక్కటి కవిత.

    ReplyDelete
    Replies
    1. Meraj jee కృతజ్ఞతలు...మీ అక్షరమెప్పుడూ ప్రోత్సాహమే

      Delete
  2. మిణుగురు పురుగుల నీడల్లోనూ
    రెప్పలకిందటి చీకటిలోనూ వెలుగుతూనే ఉంటాడు
    బరువెక్కిన మనసునెప్పుడో ఈదేసాడు....Heart of the poem.
    చక్కని చిక్కనైన భావకవిత.

    ReplyDelete
    Replies
    1. Padma గారూ నెనర్లు..చాలా ఓపిగ్గా నా బ్లాగుని దర్శించి అన్నీ చదివి మరింత ఓపిగ్గా మీ స్పందనలు రాస్తున్నందుకు ధన్యవాదాలు

      Delete