Wednesday, February 27, 2013

ప్రేమాస్వాదనం

ప్రేమాస్వాదనం
హరివిల్లుని చీరకట్టి ఆకాశాన్ని తీసుకురా
నీకు ప్రేమనిస్తాను
మేఘాలకి పాటనేర్పి రెక్కలుకట్టుకురా
నీకు ప్రేమనేర్పిస్తాను
ఇద్దరం కల్సి ఓ ప్రపంచం నిర్మిద్దాం
ఏ గోడల్లేని ప్రేమప్రపంచం.....
అందాన్నంతా తనలో ఇముడ్చుకున్న
ప్రేమే సుందరం…..

నీ సమక్షంలో ఓ ప్రేమికుణ్ణవుతాను

నీ పరోక్షంలో కవినౌతానని గర్వం
ఎందుకంటే
ప్రేమే సత్యం…..

మధుమాసపు తొలిమంచు చీరలో
పారిజాతాసుమగంధ మర్దనమార్దవంలొ
నిట్టూర్పుల భాషలో ఇద్దరం ఒకటైనప్పుడూ
రసాస్వాదనలో ప్రేమ సాత్కాక్షరించినప్పుడూ
ఒకటే నిజం
ప్రేమే శివం….

అవునవును, ప్రేమే

సత్యం-శివం-సుందరం
("ప్రేమ" పుట్టినరోజుకి కానుకగా నా ఈ చిన్న బహుమతి)

14. Feb. 2013

3 comments:

  1. సత్యం,శివం,సుందరం తత్వాన్ని గురుంచి కవిగా 'ప్రేమ' తత్వం గురుంచి ప్రిమికుడిగా చాల బాగా రాసారు.

    ReplyDelete
  2. By the way ,you cud remember manamu sirakadamba lo 'ugadi swaralu' vinipinchamu if My name is Mani Vadlamani

    ReplyDelete
  3. పూర్వ ఫల్గుణి గారూ నమస్తె. ఔను మీరు చెప్పాకనే తెలిసింది ఆమె మీరూఒకరని.మీ ఆత్మీయాక్షరం హత్తుకుంది.కృతజ్ఞతలు

    ReplyDelete