Saturday, March 10, 2012

ప్రేమార్ణవం


అమ్మపాల రంగు
అవసరం లేకపోయింది
అవసరం....ఆకలయింది
అమ్మకి ప్రేమయింది

నీ ఉచ్ఛాసనిశ్వాసాల శృతిలయలు
జోలపాడుతూనే ఉంటయ్
అవసరం ప్రేమయింది
నీకు మమతానురాగమైంది

గోడక్కొట్టిన క్యాలండర్లా
నీ నడుముచుట్టూ నాచూపులు
నీతో ఈ జన్మాంతరాన్ని సాధించాలని! ప్రేమతో!
పునరుక్తంటూ చీరకొంగుతో
కొట్టినప్పుడల్లా మొహంచాటేసాను
నువ్వే కదాని!
నా రెప్పలల్లార్చడం మర్చిపోయినప్పుడల్లా
సిగ్గుపడ్తూనె కప్పుకుంటావు
లోయలన్నీ...ప్రేమ లోతు నీకేం తెల్సంటావు!

ఆ కనకాంబరం వాడినప్పుడు
ఎంతగొడవచేశావని
ఆ గుడితిన్నెకి జారగిలపడ్తూ
నీ విరహానికి అది వాడిపోయిందంటావు
అప్పుడేగా నీ చెవిలో
గొణిగాను--
ప్రేమతో పొంగిన గుండెలపై వాలనా అని
సిగ్గుపడ్తూ నన్ను లాక్కున్న నీ
చేతివేళ్ళని స్పృశిస్తూ అక్కడే ఉండిపోయానన్న
నీ చూపు గుచ్చుకుంటూనే ఉంది ఇంకా.....

ప్రేమంటె ఇష్టమంటావు
తీరా కౌగలిస్తే
అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడమంటావు
ప్రేమకిరణాలతో ప్రకృతంతా పర్చుకుంటూ....
నిక్కచ్చిగా ప్రకృతంతా రంగులమయమయితే
మరి ప్రేమ రంగూ?
నీ సిగ్గుల అంబులపొదిలోంచి తీస్కోమంటూ
ఒదిగిపోతూనే ఉంటావు
ప్రేమగా...ప్రేమతో!

3 comments:

  1. నిజంగానే ప్రేమ అవసరమే ఐయింది
    మీ కవిత చాల బాగుంది
    అందున మీరు వాడిన ఉపమానాలు చాల బాగున్నాయి.
    రెప రెపలాడే మనసుకి , వేనెలల విరబూసిన సోగాసుకి, అలుపెరుగని తపనకి మీ భావాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి

    ReplyDelete
  2. ధన్యవాదాలు శ్లోకాగారు...ప్రేమ అవసరం లేని దెవ్వరికి? మనుగడసాగిస్తున్నంతకాలం మనం ఏదోరూపంలో ప్రేమకోసం వెంపర్లాడాల్సిందే కదా?

    ReplyDelete
  3. The depth of intense desire to dissolve in the passionate moments is awesome sir...ur poetry is always awesome!!

    ReplyDelete