Thursday, December 15, 2011

"పారిపోయిన ఖైదు--The Eloped Prison"

గురజాడ ఆంగ్ల రచనలపై సమీక్షా వ్యాసం

గురజాడ ఆంగ్ల రచనలపై మాట్లాడమని మొజాయిక్ సంస్ఠవారు అహ్వానించినప్పుడు ఇది నాకు పునర్జన్మగా భావించాను. రకంగా మళ్ళీ గురజాడని చదివే అవకాశం కల్పించారు. గురజాడ గురించి ఒక్కమాట: "మనిషి బాధపడితే మంచి మాత్రెయ్యండి, మనసు బాధపడితే మంచి మాటివ్వండి మనిషి మనసు బాధపడితే వారికి గురజాడనివ్వండి"

శృంఖలా బధ్ధమైపోయిన వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యానికి తనదైనశైలిలో విముక్తి ప్రసాదించిన యుగకర్త గురజాడ గురించిన వ్యక్తిగతవిషయాల ప్రస్తావన ఇక అప్రస్తుతం-- కొన్ని మీకు తెల్సు కొన్ని వక్తలు ప్రస్తావించినవె....

గురజాడ రచనలగురించి చెప్పుకునే ముందు భారతీయాంగ్ల సాహిత్యం గురించి ప్రస్తావించుకోవల్సిఉంది.--slide 2

భారతీయాంగ్ల సాహిత్యమంటే ఆంగ్లంలో Indo-Anglian Literature. దానర్ధం మనం భారతీయభాషల్లో కాకుండా డైరెక్టుగా ఆంగ్లంలో రాసుకునె సాహిత్యం. రకమైన సాహిత్యానికి ఆద్యుడిగా, పూజ్యుడిగా గురజాడని చెప్పుకోవచ్చన్న దిశగా నా సమీక్ష ఉంటుందని మనవి. గురజాడ సమకాలికులైన టాగోర్ మరియు తోరుదత్ బెంగాల్ ప్రాంతానికి చెందిన రచయితలు. టాగోర్ బెంగాలీలోనూ, తోరుదత్ ఫ్రెంచ్ భాషలోనూ విరివిగా రాస్తూ వాటిని తామే తర్జుమా చేసే రచయితలుగా మనకి తెల్సు.

కుక్కూ అన్న పేరుతో రాసుకున్న మొట్టమొదటి ఆంగ్ల కవిత ద్వారా మన గురజాడ భారతీయాంగ్ల కవిత్వమనే ఒరవడికి నాంది పలికినట్లుగా చెప్పుకోవచ్చు.కన్యాశుల్కానికి పర్యాయపదమై, పూర్ణమ్మ సృష్టికర్తగా మాత్రమే మనకి సుపరిచితమైన గురజాడ తన కవనజీవనాన్ని ఆంగ్లకవితతో ప్రారంభించడం హర్షణీయం. దురదృష్టవశాత్తూ కవిత text అలభ్యం.కుక్కూ అంటె కోకిల. విధంగా కవికోకిల 1882 లో మెట్రిక్యులేషన్ విద్యాభ్యాస దశలోనే ఆంగ్లకవితతొ తన సాహిత్యాంరంగేట్రం చెయ్యటం జరిగింది. కవితలో ఏముందన్నది వైల్డ్ గెస్సే అయినా గురజాడ మరో ప్రముఖ రచన "దేశమును ప్రేమించుమన్నా..." లో చివరి ఖండికలో మరోసారి కోకిల ప్రస్తావనని ఇక్కడ ప్రస్తావించుకుందాం....

సారంగధర గొప్ప రచన. గురజాడ రచనా పటిమపై తనకున్న ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసె రచన. చారిత్రకభావన దేహం కాగా, భాషా సౌందర్యం, భావుకత్వపు పరికిణీలు, భారతీయత్వపు ఓణీలతో కూడిన అత్యధుత కావ్యనాయిక సారంగధర. భారతీయత్వాన్ని ఆంగ్లరచనల్లోకి చొప్పించే ప్రయత్నమే రచనని గొప్ప రచన కావటానికి కారణాల్లో ఒకటి. అప్పటికింకా మరే ఇతర భారతీయ రచయితా ఇలా రాసిఉండనికారణంగా (టాగోర్, తోరుదత్ లాంటి రచయితలు సమకాలీనులే కాని గురజాడని ప్రభావితం చేసే వారు కాదు) మిగతా రచయితల ప్రభావం గురజాడపై ఉందనడానికి ఆస్కారమే లేదు. రకంగా గురజాడ మొట్టమొదటి భారతీయాంగ్ల కవిగా పేర్కొనవచ్చు.

ఇంకా ఉంది.....


No comments:

Post a Comment