Sunday, August 14, 2011

సన్నజాజుల ముళ్ళు

పకృతి నిట్టూర్పులే ఋతువులని
తెల్సేలా ఏం చెప్పలేదు అమ్మ
నా మనసుకే వొదిలేసుంటుందేమో ఆ పాఠాల్ని.....

కాలం కాటేసిన క్షణాలని
లెక్కేసుకుంటూండగా ముఖంపై
ఓ బలమైన కెరటం
అలజడి చేసిమరీ లాక్కుపోతుంది!
ఫెడీల్మన్న బాధ్యతల కెరటం.....

జీవితపు సముద్రపుఒడ్డున
వొంటరిగా.....అలల్ని అర్ధంచేస్కోలేక అవస్థ...
ఆమె నవ్వు.....నవ్వులోని రిథమ్
అలల్ని, జీవితాన్ని విడమర్చుకున్నా....
అనుబంధాల
అబధ్ధపు నిజాలు
ఆత్మీయతల
నిజపు అబధ్ధాలు!

గడియారపు ముళ్లమధ్య ఇరుక్కున్నప్పటిమాట!

కారణం కోసం ప్రేమించలేను
ప్రేమేకారణమైనప్పుడు....
--------వాసుదేవ్ (14. ఆగస్ట్.2011)



5 comments:

  1. karanam kosam preminchalenu preme karanaminappudu ....excellent expression...dev....love urs j

    ReplyDelete
  2. శ్రీనివాస్ జీ
    అభినందనలు.జీవితమూ, సంద్రము
    అందనివి వాటి లొ లోతులు
    కంటికి కానరాని గంభీరతలు
    పై పై తరగల వురవడులు తక్క
    నిత్యం తలపడు అలజడులు తప్ప
    అద్భుత వేదాంత
    సరళిన మీ భావన...Nutakki Raghavendra Rao (kanakambaram)

    ReplyDelete
  3. "కాలం కాటేసిన క్షణాలని
    లెక్కేసుకుంటూండగా ముఖంపై
    ఓ బలమైన కెరటం
    అలజడి చేసిమరీ లాక్కుపోతుంది!
    ఫెడీల్మన్న బాధ్యతల కెరటం....."........ జీవిత సత్యాల్ని మీ కవిత ఆవిష్కరిస్తోంది సర్... అభినందనలు.

    ReplyDelete
  4. manchi bhavana.. chala bagundi vasu ji

    ReplyDelete