Friday, July 8, 2011

ద్వైతం

ఉఛ్వాస నిశ్వాసాల రోలర్ కోస్టర్‌లో
ద్వైతం కన్పడుతోంది స్పష్టంగా...
నాణానికి చెరోవైపు అతుక్కున్న
రెండు పార్శ్వాల్లా అదే ద్వైతం!
శల్య సారధ్యంలా జీవిత రధానికి
భార్యాభర్తలిద్దరూ ద్వైతమే.
ప్రేమ బండికి
పెళ్లనే రెండు జోడెద్దులు అవసరమే.

అభినందిచ్చే కరతాళానికి
రెండు చేతుల్లా...
ముక్కు సూటిగా పోయే
గడియారపు చేతులూ చేతలూ
ద్వైత సూచకమే!

రిథమ్‌లో దాగున్న అందాన్నంతా
అలవోకగా ఒలకబోస్తూ
కాలగమనాన్ని అందంగా శాసించే
వెలుగురేడు, రేవంతుల దాగుడుమూతలు
ద్వైత సమానమే....!

దేహాన్నంటి పెట్టుకున్న ఆత్మలా--
దేహం, ఆత్మ--రెంటికి రెండూ
ద్వైతానికి నిత్యసూచనంగా....

చివరికి....
ప్రేమ పరిష్వంగానికి రెండు మనసుల
అవసరం ఉన్నట్టు...
అన్నీ ద్వైత గోచరమే.

ద్వైతమే ఈ విశ్వమానవ
ప్రేమతత్వానికి పునాది!!!
------వాసుదేవ్ (08-జూలై-2011)

**బియ్యే చదువుతున్న రోజుల్లో ఈ అద్వైత, ద్వైతాల గురించి నాన్నగారు నాకు చెప్పినప్పుడు నాకు ఎందుకో ద్వైతమే (విశ్వానికి, దేవుడికి భేదముందని చెప్పే సిధ్ధాంతం) నచ్చింది. ఆయన మాత్రం అద్వైతమే(జీవాత్మ పరమాత్మ ఒక్కటే మిగిలినవన్నీ దాని రుపాలే అనే అభిప్రాయం) పైనే నమ్మకం. ఏమో ఇద్దరమూ కరక్టో లేక నేనే తప్పో తెలీదు....ఇప్పుడు నాన్నగారు తన జీవిత చరమాంకంలో మళ్ళి నా అభిప్రాయాన్నడిగారు. నేను మాత్రం ద్వైతమే సరైందన్నాను. దాని ఫలితమే ఈ చిన్న రచన......మీ వాసుదేవ్

3 comments:

  1. damodhar.rao musham
    Convener Intellectual Cell
    ANDHRAPRADESH CONGRESS COMMITTEE
    http://historyofcongress.blogspot.com/

    give yor @ http://prachinatelugu.blogspot.com/2011/07/garuda-haygriva-mantra-for-nagabandam.html

    ReplyDelete
  2. Sorry I didnt get you...Could you be more explicit here or to my mail id which is:
    adarinivas@yahoo.co.in

    ReplyDelete
  3. మీరు రాసిన ప్రతీ ద్వైతం ద్వైతమే
    కానీ కనిపించని అద్వైతం వుంది.. అందులో..
    మీరు అద్వైతం నుంచి ద్వైతం వైపుకు వచ్చారు..
    ప్రేమ కు రెండు మనసులు
    కరతాలానికి రెండు చేతులు..
    నిజమే ద్వైతమే
    బట్ రెండు మనసులు కలయిక ప్రేమ..
    రెండు చేతుల ఏక కాలపు చప్పుడు కరతాలం
    ద్వైతం నుండి వచ్చిన అద్వైతం

    ఏకం సత్...
    మన వ్యూ అన్నిటిని మారుస్తుంది..
    మీ మనసుకు ద్వైతం నచ్చింది
    దాన్ని హై లైట్ చేసారు..
    మీ ప్రయాణం మళ్ళీ ద్వైతం నుంచి అద్వైతం వైపుకూ మారోచ్చూ మారక పోవోచ్చూ
    పథికుడు ఆగనంత కాలం పయనం ఖాయం..
    అదే ముఖ్యం

    ReplyDelete