Friday, February 18, 2011

అస్వాధీనంలో.... ఓ రాత్రి

----- వాసుదేవ్

పలుచని మధ్యాహ్నం సాయంత్రానికి చిక్కబడింది
మడతల ముడతల నిద్రలోకి
నిద్ర గాఢతలోకి జారుకున్నా
గాఢంగా....
చాలా గాఢంగా

భయంలేని
నిద్రలోకి
అమ్మ ప్రేమలొ ఆమె ఒడిలోకి ఒదిగినట్లుగా


ఏమీ తెలియనితనం
ఏదో మాయ, ఏదో అస్పష్టత
ఒంటరితనంలోని మర్మం
ఆ నిద్ర లోనే ఓ స్ఫురణ, ఓ ప్రస్తానం
హఠాత్తుగా ఓ స్వేచ్ఛాకవాటం,
ఓ మంత్రముగ్ధుఢిలా
నడుస్తూ, నిద్రనడకలో ప్రస్థానిస్తూ
చివరికొచ్చేశాను, ఆశ్చర్యంగా!

అక్కడే నా మనసులాంటి ఓ గది
అలా మూసుకుపోతూనే ఉంది, నా ప్రమేయం లేకుండా

చీకటి ఇంకా చిక్కబడింది
చిక్కని చీకటి, నల్లటి రాత్రిలా!

నాలో ఏదో ఓ వింతమార్పు
పూర్తిగా నాలోనే, ల్లోల్లోపల!
నా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది నా ఆలోచన్లతో
ఓ కథ అల్లుకున్నట్టూ
కీ ఇచ్చిన గడియారపు స్ప్రింగు
అల్లుకున్నట్టూను.... చుట్టలు చుట్టలుగా.!

అ కథలో, ఆ గదిలో
ఓ రెండు పాత్రలు
ఆనందం, బాధ
కానీ విచిత్రంగా వాళ్ళిద్దరూ
అదే తప్పు చేస్తూ కన్పడ్డారు
నాలానే.
బాధ.....!
దాని గురించి ఆనందానికి
ఎప్పుడూ చెప్తూనే ఉంటా
అది అలసిపోయేవరకూ
విసిగివేసారి వరకూ
చివరికి ఓడిపోయేవరకూ
అప్పుడే అది నాది అవుతుంది
బాధలో ఆనందం --
అప్పుడే చూశాను

*********

జనవరి నెల Poetry మ్యాగ్‌జైన్ లో పబ్లిష్ అయిన MARK STRAND రాసిన కవిత Mystery and Solitude in Topeka ప్రేరణతో రాసినది. ఓ రకంగా స్వేఛ్చానువాదం అనుకోవచ్చు.

2 comments:

  1. వాసుదేవ్ జీ ...అస్వాదీనంలో ఓ రాత్రి.... .వ్యక్తావ్యక్త భావ సంఘర్షణ .స్వీయసఫల విశ్లేషణానువాదం ... యీ రచన. అనువాదంలా లేదు.
    "ఓ కథ అల్లుకున్నట్టూ
    కీ ఇచ్చిన గడియారపు స్ప్రింగు
    అల్లుకున్నట్టూను...." ఇక్కడ రెండు మార్లు స్ప్రింగ్ అల్లుకోనక్కరలేదు....అభినందనలతో ...నూతక్కి రాఘవేంద్ర రావు.

    ReplyDelete