రాత్రిపై నుంచి నడిచొచ్చానా
గుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!
కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో
కదులుతూ
కథలుగా మారలేకపోయాయి
ఓ అక్షరంలో కూర్చుని మరొకదాంతో
చెప్పుకుంటూ ఉంటాను
ప్రతీపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరి...
దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలు
ఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..
సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!
తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లా
ఈ జ్ఞాపకాలు....
అర్ధంకాని బంధాలేవో
పేపర్ వెయిట్‌లా జీవితావేశాన్ని
అదిమిపెడుతుంటాయి
తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు
ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె
సమాధిలో శవానికి మిత్రుల్లేరన్న
'గాలి' ఊళల్లోని మాటలు కొన్ని చెవిదాటిపోవు
అవును
పిరమిడ్లలోని రాళ్ళేవీ
జీవితతంలోని డొల్లతనాన్నీ నింపలేవు
నా దృష్టినీ అడ్డుపెట్టలేవు
అయినా ఏం చూస్తున్నానని?
రాత్రికట్టుకున్న నల్లచీరలాంటి చీకటీ
సంద్రాన్నంతా కప్పేసుకున్న అలలనురగల్లోని తెలుపూ
రంగులన్నింటినీ తమలోకి లాగేసుకుంటే
ఇక నాకేం మిగిలిందని....?
కన్నీటి రంగుతప్ప!
అరువుతెచ్చుకున్న మేధోతనమేదీ నిలబడదు
చిన్న ఒంటికి పెద్ద అంగీలా
అసహజంగా, అసమానంగా....
అటో ఇటో ఎటో
ఎటూకానీ అవస్థాంతరం
ఈ నడివయసు!
విస్తరించుకుంటున్న శూన్యత
ఆఖరికి ఈ పాపనివేదన గదిలోనూ...
గుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!
కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో
కదులుతూ
కథలుగా మారలేకపోయాయి
ఓ అక్షరంలో కూర్చుని మరొకదాంతో
చెప్పుకుంటూ ఉంటాను
ప్రతీపదం ఓ కన్ఫెషన్ బాక్స్ మరి...
దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలు
ఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..
సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!
తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లా
ఈ జ్ఞాపకాలు....
అర్ధంకాని బంధాలేవో
పేపర్ వెయిట్‌లా జీవితావేశాన్ని
అదిమిపెడుతుంటాయి
తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు
ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె
సమాధిలో శవానికి మిత్రుల్లేరన్న
'గాలి' ఊళల్లోని మాటలు కొన్ని చెవిదాటిపోవు
అవును
పిరమిడ్లలోని రాళ్ళేవీ
జీవితతంలోని డొల్లతనాన్నీ నింపలేవు
నా దృష్టినీ అడ్డుపెట్టలేవు
అయినా ఏం చూస్తున్నానని?
రాత్రికట్టుకున్న నల్లచీరలాంటి చీకటీ
సంద్రాన్నంతా కప్పేసుకున్న అలలనురగల్లోని తెలుపూ
రంగులన్నింటినీ తమలోకి లాగేసుకుంటే
ఇక నాకేం మిగిలిందని....?
కన్నీటి రంగుతప్ప!
అరువుతెచ్చుకున్న మేధోతనమేదీ నిలబడదు
చిన్న ఒంటికి పెద్ద అంగీలా
అసహజంగా, అసమానంగా....
అటో ఇటో ఎటో
ఎటూకానీ అవస్థాంతరం
ఈ నడివయసు!
విస్తరించుకుంటున్న శూన్యత
ఆఖరికి ఈ పాపనివేదన గదిలోనూ...
రాత్రిపై నుంచి నడిచొచ్చానా
ReplyDeleteగుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!
కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో
కదులుతూ
కథలుగా మారలేకపోయాయి...
.....ఇలా అందమైన భావాలతో మొదలైన కవిత...
అంతకంటే అందమైన అక్షరాలతో ముగిసింది...
అభినందనలు వాసుదేవ్ గారూ!...@శ్రీ
శ్రీ మీ అభిమానం అసామాన్యమైనది..కృతజ్ఞతలు
Deleteవాసుదేవ్ గారూ, కవితలో ఓ విదమైన విరక్తి మరియు విరహభావనా కనిపిస్తుంది.
ReplyDeleteఅక్షరాలను కూర్చేందుకు మీరు ఎన్నుకున్న పదాలదారం భావంలో దాగి మురిపిస్తుంది.
కవిత చాలా బాగుంది.
మెరాజ్ గారూ మీ స్టాంప్ పడితే ఇంకా నాక్కావాల్సిందేముంది..నా కవితనై మళ్ళీ మీ అక్షరాల్లొ చదువుకున్నాను.
Deleteకవిత చాలా బాగుంది వాసుదేవ్ గారూ
ReplyDeleteలాస్యగారూ ధన్యవాదాలు చిన్నమాటైతే మన్నించాలి..నాబ్లాగ్ సందర్శించి మీ అభిప్రాయాన్ని ఇక్కడ రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఈ స్పందనతో మరో బ్లాగర్ని చూడబొతున్నానన్న ఆనందం కూడా ఉంది
Delete"అర్ధంకాని బంధాలేవో
ReplyDeleteపేపర్ వెయిట్‌లా జీవితావేశాన్ని
అదిమిపెడుతుంటాయి
తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు
ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె"......... తేమకి, తడికి తేడా తెలిసేదెప్పుడు ఆర్ధ్రత ఎప్పుడో ఆవిరైపోయిందిగా.. హృదయాన్ని సూటిగా తాకేలా ఉన్నాయి ఈ మాటలు దేవ్‌గారూ.. కవిత ఇది బాగుంది, ఇది బాగలేదు అని చెప్పేందుకు ఏదీ లేదు.. కవిత అంతా చాలా చాలా బాగుంది..