Saturday, June 18, 2011

కాలంతో మూడుముళ్ళు....


రాత్రి దుప్పటి కప్పుకున్న పగల్ని
చూసినప్పుడల్లా అదే ఆవేదన
బాధ్యతల బరువుతో నిద్రపోలేనని.....

పగటి చీరకట్టుకున్న రోజు
పలకరించినప్పుడూ పలవరింతే!
జీవితసవాళ్ళు గుమ్మానికి
తోరణాలయ్యి వేళ్ళాడుతుంటే!

నిన్నని మూసేసిన నేడు సాక్షాత్కరించినప్పుడు
అదే ఆవేదన, ఏదో ఆందోళన
ఏం సాధించలేదని నిన్న
నన్ను వెక్కిరించినట్టు...!

నిన్న, మొన్న, అటుమొన్న
కాలాన్ని ఖననం చేస్తూ తొందరపాటు,
ప్రేమనైనా సాధించలేదనే తొట్రుపాటు..!

అదే పోరాటం, కాలంతో ఎదురీత
మంచులా కరిగిన మంచిరోజులు
వెన్ను చరిచి "కాలం" వెన్నలాంటివన్నాయి!

మనసు కళ్ళు తెరిచిచూస్తే ఇంకేముంది
బంధాలు, బాంధ్యవ్యాలు బరువెక్కాయి
అనురాగాలు అర్రులుచాసాయి.

కాలంతొ సంధి చేసుకున్నాను
తన నాల్గో పార్శ్వం--
"ప్రేమ" తో మూడుముళ్ళకి ఒప్పించేశాను.
నా ఈ కాలంతో కళ్యాణానికి
మీరందరు నిరంతరం ఆహ్వానితులే.......
మీ వాసుదేవ్ (18.జూన్.2011)

2 comments:

  1. బాగుందండి. అవునూ, బ్రూనై విశేషాలతో ఒక టపా రాయకూడదూ.

    ReplyDelete
  2. ధన్యవాదాలు తేజస్వి గారు.....మీరు అన్నట్టుగా రాయాలనిఉంది.....అయితే నాబ్లాగులో పొస్ట్ చేస్తే ఎక్కువమందికి రీచ్ అయ్యే అవకాశంలేదు.....ఫేస్‌బుక్‌లో టపాలకి మమ్చి రెస్పాన్స్ ఉంటుంది.......ఇక టైమ్ చూసుకుని రాయాలి........మీ వాసుదేవ్

    ReplyDelete