Monday, September 9, 2013

ప్రేమా! నీకు జోహార్లు!

కిటికీ రెక్కలపై చినుకు సంతకం
నువ్వొచ్చావనే నమ్మకమైన ఫీల్! అందమైన ఓ అందాజ్
నీ అనుభూతికింత ఎడిక్ట్ అయ్యానన్న తప్పే కానీ
తప్పేముందిలే అన్న పట్టుదలా లేకపోలేదు
***
 రాత్రిని వెన్నెలని కవ్వంతో చిలికితే వచ్చేమాటలన్ని
నీగురించేనన్నదొక్కటీ చాలదూ--
ఇలా రాస్తుండటానికి?
నిన్నూ నన్ను కలిపినవే మాటలేకరువైనా
తీరా నువ్వొచ్చేసరికి మాటలకరువు
ఎప్పుడూ ఉండేదే!
 ***
ఎగిరెగిరిపడే నీ గుండెలకి
సముద్రమూ అసూయపడిందేమొ
నాకేం చెప్పకనే వెనుతిరుగుతుంది…..నీలా
ఏకొద్దిసేపో ఇద్దరిమధ్యా మౌనం
గుండాగినంతపని కొన్ని క్షణాలకి....
ప్రేమ అడుగుల చప్పుడు గుండెలపై సున్నిత మోత
చీరకుచ్చెళ్లకీ సంగీతముంటేనా అని
అనుకోని క్షణముందా....
 ***
నాజూకు వర్షపు చినుకుల పరిమళం
నీగుసగుసలపలకరింపులా...పరిచయమే
కనీసం ఈ క్షణం బంధీ నాలో
నీకోసమేనన్నట్టు...ఓ ప్రేమాక్షరాల బొకె
***
మనసుందని ప్రేమించలేను--మనసే ప్రేమైనప్పుడు
నువ్వు లేవనీ అనుకోలేను--ప్రేమే నువ్వైనప్పుడు

7 comments:

  1. రాత్రిని వెన్నెలని కవ్వంతో చిలికితే వచ్చేమాటలన్ని
    నీగురించేనన్నదొక్కటీ చాలదూ...
    ఇలా రాస్తుండటానికి?
    నిన్నూ నన్ను కలిపినవే మాటలేకరువైనా
    తీరా నువ్వొచ్చేసరికి మాటలకరువు
    ఎప్పుడూ ఉండేదే!
    మధురభావాల సుమమాల...చాలా బాగుందండి.

    ReplyDelete
  2. కిటికీ రెక్కలపై చినుకు సంతకం...మొదటి పదంతోనే ఆకట్టేసారు

    ReplyDelete
  3. అనికేత్ గారూ ధన్యోస్మి. నా అక్షరాలపై మీ మక్కువని తెలియచెప్పినందుకు

    ReplyDelete
  4. నాజూకు వర్షపు చినుకుల పరిమళం
    నీగుసగుసలపలకరింపులా...పరిచయమే
    కనీసం ఈ క్షణం బంధీ నాలో
    నీకోసమేనన్నట్టు...ఓ ప్రేమాక్షరాల బొకె" ఈ అక్షరాలు చాలు గుప్పిట దాగిన ముత్యాలై మీ కవితని భావాన్నీ మెరిపిస్తాయి

    ReplyDelete
    Replies
    1. Meraj jee. ధన్యోస్మి. మీ పలకరింపు మరింత ఉత్సాహాన్నిచ్చింది

      Delete