Sunday, October 10, 2010

మనకొద్దీ గేమ్స్!

మన ముంగిట్లో, మన వాకిట్లో కామన్వెల్త్ సంబరాలు
మన పిల్లలు గెల్చుకుంటున్న గండపెండేరాలు
ఒకటా,రెండా డజన్ల కొద్దీ పతకాలు
ప్రపంచపు నాలుక దగ్గర నివ్వెరపోయిన ఉత్సవాలు
అఖిలుడూ, అనిలుడూ మనవాడే
దేశంకోసం బరువులెత్తిన వాడే
అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు కల్సి పోరాడారు
విజయాన్ని మెడలో వేసుకుని గళమెత్తారు
జనగణమనని మననం చేసుకున్నారు
అంతా సవ్యమన్నారు సర్కారువారు
ఇదంతా సహజమన్నారు నిర్వాహక ప్రభువులవారు
జంతమంతర్ సాక్షిగా లక్షకోట్ల నాణేల రణగొణధ్వనులు మిన్నంటాయి
కుతుబ్‍మినార్ నీడలో బిచ్చగాడి ఆకలి కేకలు విన్పిస్తూనే ఉన్నాయి.....