
ఎన్ని కన్నీటి స్నానాలని
ఎన్నెన్ని రోదనలని
మనసుని దాటిన ఆవేదనా రాగాలు
జైలు గోడలని తాకిన వేదనా సంఘర్షణలు!
రాత్రికీ పగలుకీ తేడా కోసం వెతికిన
క్షణాలే అన్నీను నా సోలోలో
కలల్ని కోసేసిన తృళ్ళిపాటు
వెంటాడే స్మృతుల గగుర్పాటుతో
జతకల్సిన ఒంటరి రాత్రులు!
ఎవరికెరుకని......!అనుభూతించిన గుండెకి తప్ప....
ఎన్నో జ్నాపకాలు, మరెన్నో ముద్రలు
ఏడు చువ్వల్ని పట్టుకున్న చేతులు
కన్నీళ్ళతో ఇంకిపోయిన బట్టల్ని
అడుగుతూ నేను
నా వెంటే నా నీడ
స్వేఛ్ఛకోసం మారాం చేస్తూ...!
బువ్వరుచికి నాలుక చాచినప్పుడల్లా
నొక్కేసాను ఇది
అమ్మ ముద్ద కాదంటూ!
శ్రావ్య సంగీతమూ అపశృతుల
తాళాలే
బూట్ల శబ్దంలో కల్సిపోయి...!
నా రెక్కల్ని కుట్టేసిన
జైలుగోడల్ని కసిగా
కొట్టిన చేతులు రక్తసిక్తమయ్యాయి
నా కలల్లా....!!!!
ఆశకి నిర్వచనం దొరికిందిక్కడే
ప్రాణం పోసుకున్నదీ ఇక్కడె!
ఆ చతురస్రంలో ఎన్ని చతురతలో
ఎన్నీ గీతలో మరెన్నో గీతా' "సారా"లో
ప్రతీ పక్షీ రెక్కల చప్పుడూ
నా లోని స్వేఛ్ఛా మంటల రగిల్చినవే....
ఒంటరి మనసు
ఎండి కిందపడిన ఎండుటాకులా
ఎగిరిపడ్తూనే ఉంది
స్వేచ్ఛ కోసం...
హద్దుల్లేని స్వేచ్ఛ కోసం!!!
(జైలు జీవితంపై రాయమని మిత్రులు అడిగినమీదట స్పందనగా రాసుకున్నది)
chala ardranga undi ...love j
ReplyDelete**నా వెంటే నా నీడ
ReplyDeleteస్వేఛ్ఛకోసం మారాం చేస్తూ**
స్వేఛ్చ కాంక్ష కి పరాకాష్ట గా వుంది..
ఆవేదన కే అశ్రువులు వచ్చే లా
ఆకాంక్షా విహంగం రెక్కలు వెతుక్కునేలా...
సుపర్బ్ దేవ్ జీ
superb.. chaala baagundi..human beings love their freedom most..very good..
ReplyDeleteజైలు జీవితపు ఒంటరితనాన్ని ప్రతి అక్షరంలోనూ ప్రతిబింబించారు....చాలా బాగుంది. ఇంత ఆద్రతగా రాయటంలో మీకు మిరే సాటి
ReplyDelete