Sunday, May 22, 2011

అక్షర సత్యం

---- వాసుదేవ్


అనుబంధాలన్నీ ధన బంధాలవుతుంటే
అర్ధం కాని బంధాలన్ని ఆర్ద్రమవుతూ....

ఇదే ( ౦ )నా న్యాయమని అడిగినప్పుడల్లా
నిజం మానభంగానికి గురవుతూ.....

ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ కూడా
దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ....

జీవన్మరణ చట్రంలో ఇమిడిపోయికూడా
వయసు ప్రగల్భాలకు రంగులద్దేస్తూ........

'నా' నుండి నన్ను నేను విడదీయలేనని తెల్సీ
నాలోనే అన్నీ ఉన్నాయని బతికేస్తూ......

కాలాన్ని, కలాన్ని వెనక్కి తీసుకోలేమని
మనసు ఋతుస్రావంలో ఎండిన రక్తం
ఈ చిన్న జీవితమన్నది

అక్షర సత్యం


1 comment:

  1. అనుబంధాలన్నీ ధన బంధాలవుతుంటే
    అర్ధం కాని బంధాలన్ని ఆర్ద్రమవుతూ....

    అంతా బాధపదుతున్నాం. ఎక్కడినుంచి మారాలో తెలీడంలేదు. బావుంది వాసుదేవ్ గారు.

    ReplyDelete